విశాఖకు చెందిన యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2017లో ఓ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ. 4 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. భార్గవ్‌ది విశాఖలోని పూర్ణామార్కెట్. పలు సినిమాల్లో కూడా నటించాడు. టిక్‌టాక్‌లతో బాగా ఫేమస్ అయ్యారు.