వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పై ఇటీవలి కాలంలో వస్తున్న వ్యతిరేక వార్తల నేపథ్యంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి శనివారం మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సెంటర్ ను సందర్శించారు. సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ 2015 లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు శ్రీకారం చుట్టామని, సెంటర్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి విషయంలో అభ్యంతరాలు వచ్చినందున ప్రభుత్వ పరంగా కొత్తగా భూ కేటాయింపులు చేస్తామని మీడియాకు చెప్పారు.