వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వీక్లీ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.