విశాఖ ఎంవీపీ కాలనీలోని తితిదే కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా. సుమారు 1000 మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు తితిదే సంస్థ ఉచితంగా పూజా సామాగ్రితో పాటు రెండు రకాల ప్రసాదాలను అందజేసింది. అనంతరం కళాకారుల కూచిపూడి, భరతనాట్యం, సంకీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.