విశాఖ: విత్తన బంతులతో పచ్చని వనాలు

58చూసినవారు
విశాఖ: విత్తన బంతులతో పచ్చని వనాలు
విత్తన బంతుల ద్వారా పచ్చని వనాలను పెంచవచ్చని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ మహానగర పర్యావరణ సంయోజక్ డాక్టర్ ఎస్. పి. బి. రంగాచార్యులు అన్నారు. ఆదివారం సీతమ్మధార కొండపైన వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విత్తన బంతులు చల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడానికి పండ్ల విత్తనాలను సేకరించి, పేడ, మట్టి, బూడిద కలిపి విత్తన బంతులు తయారు చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్