విశాఖ: యోగాలో గిన్నిస్‌ రికార్డు సాధించాలి

69చూసినవారు
విశాఖ: యోగాలో గిన్నిస్‌ రికార్డు సాధించాలి
జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలో "యోగాంధ్ర" కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో కృష్ణబాబు మాట్లాడుతూ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్