జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్. ఎస్. వర్మ ఈనెల 24వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల వలన సెలవులో ఉన్నందున ఆయన నిర్వహిస్తున్న డిడివో బాధ్యతలను, డిపిఓగా విధులు నిర్వహిస్తున్న ఎం. వి. డి. ఫణిరామ్ కు అప్పగిస్తూ ఇంచార్జ్ కమిషనర్ ఎమ్ఎన్. హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఫణిరామ్ శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యతలను స్వీకరించారు.