విశాఖ: జీవీఎంసీకి ఉత్తమ వసూలు సంస్థ అవార్డు

84చూసినవారు
విశాఖ: జీవీఎంసీకి ఉత్తమ వసూలు సంస్థ అవార్డు
2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్ల ఆస్తి, ఖాళీ జాగాపై పన్నులు వసూలు చేసి, మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (GVMC)రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. ఈ విజయాన్ని గుర్తిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్. సురేష్ కుమార్, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ శ్రీ ఎస్.ఎస్. వర్మకు శుక్రవారం ఉత్తమ వసూలు సంస్థ అవార్డు అందజేశారు. అందరూ నిష్టతో పని చేసి విజయాన్ని సాధించారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్