విశాఖ సెంట్రల్ జైలులో కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. సూపరింటెండెంట్ సిబ్బందిని అవమానించారంటూ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగినట్టు సమాచారం. తనిఖీల పేరుతో ఖైదీల ముందే దుస్తులు విప్పించారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. భార్యబిడ్డలతో కలిసి జైలు వద్ద ఆందోళనకు దిగడంతో ఈ సంఘటనపై హోం మంత్రి ఆరా తీశారు. జైళ్ల శాఖ విభాగాధిపతితో ఫోన్ చేసి మాట్లాడారు.