విశాఖ: నిండు గర్భిణీని హత్య చేసిన భర్త

76చూసినవారు
విశాఖ: నిండు గర్భిణీని హత్య చేసిన భర్త
విశాఖలోని మధురవాడ ఆర్టీసీ కాలనీలో సోమవారం నిండు గర్భిణీ అనూష అనే మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త జ్ఞానేశ్వరరావే ఆమెను గొంతునొక్కి చంపాడు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరగ్గా. కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య గొడవలైతున్నట్టు సమాచారం. ప్రస్తుతం 8వ నెల గర్భవతిగా ఉన్న అనూషకు మరికొద్ది గంటల్లో డెలివరీ జరగాల్సి ఉండగా, ఆమె భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా జ్ఞానేశ్వర్ అనూషను తానే హత్య చేశానని అంగీకరించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అనూషపై జ్ఞానేశ్వర్‌కు అనుమానాలు ఉన్నట్లు వెల్లడైంది.

సంబంధిత పోస్ట్