విశాఖ బీచ్ లో సముద్ర స్నానం చేస్తుండగా నీటిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను లైఫ్ గార్డు రక్షించారు. రుషికొండ తీరంలో జరిగిన ఈ ఘటనలో ఆయుష్, తకర్, సత్యం తకర్ అనే వ్యక్తులు సముద్రపు నీటిలో చిక్కుకున్న విషయాన్ని గమనించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ప్రాథమిక చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. రాయ్ పూర్ కు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రలో భాగంగా బీచ్ కు వచ్చినట్టు సమాచారం.