విశాఖ: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి

76చూసినవారు
విశాఖ: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి
విశాఖలోని ఆరిలోవ చిన్నగదిలిలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతి చెందాడు. జేమ్స్ ఆస్పత్రి సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డు వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన కోడలిని తీసుకుని హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రికి తీసుకుని వచ్చినట్టు సమాచారం. ఆరిలోవ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం అతన్ని కేజీహెచ్ కు తరలించారు. మృతుడు ఒడిశాకు చెందిన బిజయ్ ముండాగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్