విశాఖజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని సుమారు 1385 పాఠశాలల్లో ఈ సమావేశం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12: 35 గంటల వరకు జరుగుతుందన్నారు.