విశాఖలో ట్రాఫిక్ భారం తగ్గించేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైకి మెట్రో, కింద వాహనాల రాకపోకలతో 'డబుల్ డెక్కర్' విధానం అమలు చేయనున్నారు. దీని కోసం ఏపీ మెట్రో కార్పొరేషన్ డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది.