విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లోకి ఒక కుటుంబం, తమ 8 ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి, శుక్రవారం అతన్ని గుర్తించి క్షేమంగా కుటుంబానికి అప్పగించారు. మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించిన త్రీటౌన్ పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.