విశాఖ: విమాన సర్వీసుల రద్దుపై ఎంపీ కీలక ప్రకటన

57చూసినవారు
విశాఖ: విమాన సర్వీసుల రద్దుపై ఎంపీ కీలక ప్రకటన
విశాఖ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కొత్త విమానాలు నడిపేలా చర్యలు తీసుకుంటానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. శనివారం విశాఖలో ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు పలు విమాన సర్వీసులు రద్దు విషయంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో చర్చించిన ఆయన ఆ వార్తలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విజయవాడ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అవే కాకుండా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కొత్తగా ప్రవేశపెడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్