గీతం డీమ్డ్ వర్సిటీ అందిస్తున్న కొన్ని కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు లభించినట్లు ఇంటర్నల్ క్వాలిటీ సెల్ డైరెక్టర్ ఆచార్య ఆర్. రాజా ప్రభు మంగళవారం తెలిపారు. ఇది గీతం నాణ్యత ప్రమాణాలకు గుర్తింపు అని, బోధన విధానాలు, నైపుణ్య అభివృద్ధి ఆధారంగా ఈ గుర్తింపు లభించిందన్నారు. ఇప్పటికే నాక్ A++ గ్రేడ్, NIRF, QS ఆసియా, టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్‌లు పొందినట్టు తెలిపారు.