తత్కాల్ వేళల్లో ఎటువంటి మార్పులు లేవని విశాఖ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో తత్కాల్ వేళల్లో మార్పులు అంటూ వార్త వైరల్ అయింది. ఈనెల 15వ తేదీ నుంచి తత్కాల్, ప్రీమియం తత్కాల్ వేళలు మారుతున్నట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని విశాఖ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.