విశాఖ నగరంలో పేద ప్రజల వైద్యశాల అయినటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ.పి తీసుకునేందుకు రోగులకు కష్టాలు తప్పడం లేదు. బుధవారం సర్వర్లు మొరాయించడంతో ఓ.పి తీసుకునేందుకు చాలా సమయం పట్టింది. విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ పలువురు రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందరి వద్ద చరవాణిలు ఉండవని, పాత పద్ధతి ప్రకారమే ఆధార్ కార్డు తీసుకుని ఓ.పి ఇవ్వాలని అధికారులను పలువురు కోరారు.