జీవీఎంసీ జోన్-4 పరిధిలో పలు దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ల పక్కన ఉన్న మార్కెట్లకు మే 28 న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం తెలిపారు. 31, 35, 37 వార్డులలో ఉన్న వ్యాపార సముదాయాలను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు నగరంలో గల సూర్య భాగ్ GVMC జోన్-4 జోనల్ కార్యాలయం వద్ద మే 28న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు.