ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ శనివారం విడుదలైంది. జూన్ 20న సాయంత్రం 6:50కి విశాఖ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చి, ఈస్టన్ నావల్ కమాండ్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. జూన్ 21 ఉదయం 6:30కి బీచ్ రోడ్‌పై యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత గెస్ట్ హౌస్‌కి వెళ్లి, ఉదయం 11:45కి ఢిల్లీకి బయలుదేరుతారు.