హోంమంత్రి ఎన్నికల ముందు విజయమ్మ, భారతిని ఎంతో నీచంగా, దారుణంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసిందేనని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి మంగళవారం అన్నారు. ఇప్పుడు అదే హోంమంత్రి నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మహిళలకు ఆత్మగౌరవం ఉండదా? వారి మనోభావాలు దెబ్బతినవా? అని ఆమె ప్రశ్నించారు. క్షమాపణ చెబుతారా? అని సూటిగా నిలదీశారు.