విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఔట్రీచ్ బ్రాండింగ్ అండ్ మీడియా అసోసియేట్ డీన్గా ఆంగ్ల విభాగం ఆచార్యులు డాక్టర్ ఎన్. సాల్మన్ బెన్నీ నియమితులయ్యారు. ఆయన శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ అండ్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ , జర్నలిజం ఆచార్యులు చల్లా రామకృష్ణ ఆచార్య బెన్నీ కి బాధ్యతలు అప్పజెప్పారు.