సంక్రాంతి సందర్భంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆకాంక్షించారు. విశాఖలోని వైసిపి కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా భోగిమంట వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.