ఈనెల 13వ తేదీ నుంచి విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు శుక్రవారం తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు 20, రాజమండ్రి, విజయవాడకు 40, కాకినాడకు 20, విజయనగరం , పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం ప్రాంతాలకు 830 బస్సులు నడపనున్నామని తెలిపారు.