విశాఖ: కళాశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

76చూసినవారు
విశాఖ: కళాశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురవాడ మారికవలసలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోన్న వేదాంత కార్తికేయ అనే విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. చదువు విషయంలో యాజమాన్యం ఒత్తిడి భరించలేకే కార్తికేయ ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు చెబుతున్నారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్