విశాఖ వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్ పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ కైలాసగిరిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆయన కైలాసగిరి వచ్చి సందర్శకులు, పర్యాటకులతో మాట్లాడి అక్కడ కల్పించాల్సిన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, సందర్శకుల సూచనల మేరకు పారిశుద్ధ్యం మెరుగ్గా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.