మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.. గతంలో వైసీపీ,టీడీపీ తమ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని.. అప్పుడు ప్రశ్నించని వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారా.. లేదా అనేది తన దృష్టిలో లేదని.. ఒకవేళ ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే ఆ ముహూర్తాలు మీకు చెబుతామా అని సోము వీర్రాజు అన్నారు.