విశాఖ పోలీసులు సైబర్ నేరగాడిని పట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని, న్యూడ్ వీడియో కాల్స్ చేయమని బలవంతం చేసి, వాటిని రికార్డు చేసుకొని డబ్బుల కోసం బెదిరిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఒక మహిళకు తన కూతురి న్యూడ్ ఫోటోలు గుర్తుతెలియని వాట్సాప్ నంబర్ నుంచి వచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు రావడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.