ఓ లారీ డ్రైవర్ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఆరోపలపై ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్స్ వేటు విధించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో ఓ లారీ డ్రైవర్ నుంచి కంచరపాలెం కానిస్టేబుల్ సన్నిబాబు, ఎస్ రామకృష్ణ తో పాటు హోంగార్డు గురున్నాయుడు అక్రమంగా డబ్బులు వసూలు చేయగా సీపీకి ఫిర్యాదు అందింది. దీంతో వీరిని సస్పెండ్ చేశారు.