విశాఖ: రెండు లారీలు ఢీ. డ్రైవర్ కు తీవ్ర గాయాలు

55చూసినవారు
విశాఖ: రెండు లారీలు ఢీ. డ్రైవర్ కు తీవ్ర గాయాలు
విశాఖ ఆనందపురంలోని పెందుర్తి రహదారిలో ప్రమాదం జరిగింది. సోమవారం దుక్కవానిపాలెం సమీపంలో వేగంగా వచ్చిన రెండు లారీలు ఢీకొనడంతో ఓ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పెందుర్తి నుంచి ఆనందపురం వస్తున్న రెండు లారీలు దుక్కవానిపాలెం అండర్ పాస్ స్పీడ్ బ్రేకర్ వద్ద ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే బాధితుడిని 108 వాహనంలో తగరపు వలస సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ పాపారువు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్