విశాఖ కేజీహెచ్ ఎన్ఐసీయూకు ఆక్సిజన్ సరఫరా నిలిపి పసిపిల్లల ప్రాణాలతో ఓ వ్యక్తి చెలగాటమాడేందుకు యత్నించాడు. ఉద్యోగం నుంచి తీసేసారనే కోపంతో ఆక్సిజన్ పైపులు కట్ చేసేందుకు యత్నించగా సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా కత్తితో బెదిరించి దాడికి యత్నించారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సీపీకి ఫిర్యాదుతో రేపుల రాజు సహా ముగ్గుర్ని పోలీసుల అరెస్ట్ చేశారు. గతంలో రాజు ఇలాగే చేయగా ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.