మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గొప్ప దార్శనికుడని, అస్తవ్యస్తంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి దేశముఖచిత్రాన్ని మార్చేసిన గొప్ప ఆర్థికవేత్త అని వి.ఎం.ఆర్.డి.ఎ చైర్ పర్సన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ కొనియాడారు. వి.ఎం.ఆర్.డి.ఎ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి సోమవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.