కేంద్రం ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమలును నిరసిస్తూ సీపీఐ విశాఖ జిల్లా సమితి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. శనివారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడం కోసమే ఈ చట్ట సవరణ తీసుకువచ్చారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు.