రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని శాసన మండలిలో వ్యవసాయ సంక్షోభంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నామని, విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించామని మంగళవారం అన్నారు. విత్తనాలు, ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించామన్నారు. అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందన్నారు.