రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని విశాఖ వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం విజయవంతంగా అమలు చేశామని, ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ డబ్బులు అందజేశామని ఆయన శనివారం స్పష్టం చేశారు.