విశాఖ వన్‌టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొత్తగా తెరిచిన వైన్‌షాపుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంతో పాటు అదే ప్రాంతంలో మసీదు, చర్చి ఉండటంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ప్రదేశాల సమీపంలో మద్యం అమ్మకాలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే షాపు తొలగించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.