మహిళల అభ్యున్నతి, వ్యాపార రంగంలో వారిని ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఏరినాలో బిందు సొసైటీ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఆధ్వర్యంలో 'మై వెబ్ ఎక్స్‌పో' ఎగ్జిబిషన్‌ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూలై 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో 60కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.