విశాఖ జిల్లాకు చెందిన అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని రికార్డు చేసి ఆ వీడియోలను ఆమె తల్లికి పంపి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలి తల్లి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేయగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.