బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖ సాగర తీరంలో అలల ఎగసి పడుతున్నాయి. సముద్ర గాలలు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయం నుంచి సముద్రం పోటెత్తుతోంది. ఆర్కేబీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్ లో సముద్రపు అలలు తీవ్రత ఎక్కువగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం కూడా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.