విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం తెలిపారు. సన్ క్యాంపస్ విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా. త్వరలో విశాఖలో టూరిజం యూనివర్సిటీ స్థాపనకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. పర్యాటక రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సన్ సీఎండీ శ్రీకాంత్ జాస్తి పాల్గొన్నారు.