ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం నుంచి నిబంధనలను అమలు చేస్తున్నామని, నిబంధనలను పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి , వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ కచ్చితంగా ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.