విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. పోర్టు చైర్మన్ డా. ఎం. అంగముత్తు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అడ్వకేట్ దివ్య హరేంద్ర ప్రసాద్ విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్ దూబే, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పి. ఎస్. ఎల్. స్వామి, ఉద్యోగినులు పాల్గొన్నారు.