కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నిరసన

76చూసినవారు
కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నిరసన
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు కె. కె. రాజు ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎల్. ఐ. సి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్