అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు సక్రియంగా పాల్గొనాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం కోరారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్లో సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. యోగా కార్యక్రమానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వివరాలకు 0891-2942015, 2040, 2044, 2055 నంబర్లకు కాల్ చేయొచ్చన్నారు.