శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మహా అన్నదానం
విశాఖలోని పెదవాల్తేరు సమీపంలోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ పోలమాంబ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ముగిసిన సందర్భంగా ఈ అన్నదానమును ఏర్పాటు చేశారు. ఆలయ ఎగ్జిక్యూట్ ఆఫీసర్ కొవ్వూరి గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాత డి. రమేష్ పాల్గొన్నారు.