అగనంపూడి పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడునంది. విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. రామకృష్ణ తెలిపారు. అగనంపూడి, దువ్వాడ సెక్టర్ 1, 2, యతపాలెం, శివాజీ నగర్, గలవనిపాలెం, శినివాడ, మంగళపాలెం, గంగవరం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని వివరించారు.