గాజువాక: జూన్ నాటికి టిడ్కో గృహాల్లో స‌దుపాయాలు

59చూసినవారు
గాజువాక: జూన్ నాటికి టిడ్కో గృహాల్లో స‌దుపాయాలు
గాజువాక నియోజకవర్గ పరిధిలోని భానోజీతోట‌ల‌, పెద గంట్యాడలో గల టిడ్కో గృహాలకు జూన్ లోగా మౌలిక వసతులు కల్పిస్తామని టిడ్కో ఈవీ సుధాకర్ వెల్లడించారు. బుధవారం టిడ్కో అధికారులు, టాటా ప్రాజెక్టు అధికారులు టిడ్కో గృహసముదాయాలు పరిశీలించారు. అనంతరం గృహలబ్ధిదారులతో మాట్లాడారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్