గాజువాక సమీప తుంగ్లాం రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిప్పుతున్న కంటైనర్, రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ నడుము భాగం నుజ్జు నుజ్జయింది. ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరూ తుంగ్లాం నుంచి కాపు జగ్గరాజుపేటకు వెళ్తున్నట్లుగా సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.