గాజువాక: స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తును కాపాడుకుందాం

51చూసినవారు
గాజువాక: స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తును కాపాడుకుందాం
ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నిస్-1 విభాగంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసమే ఈ సమ్మె అని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్